హాస్పిటల్ నుంచి కరోనా ఇంజక్షన్లు మాయం!

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. బెడ్లు దొరక్క బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మందులు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ లో మందులు చోరీకి గురవుతున్నాయి. 

ఆదిలాబాద్ లోని రిమ్స్ లో  కోవిడ్‌ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు మాయమయ్యాయి. 30 మంది రోగుల కోసం 48 డోసులు విడుదల చేశారు. అయితే..20 మందికి మాత్రమే ఇచ్చారు. మిగతా 10 మందికి వేయాల్సిన ఇంజక్షన్లు మాయమయ్యాయి.  రెమ్‌డెసివిర్‎కు బయట డిమాండ్ ఉండటంతో పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం.  రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు మాయం కావడం కలకలం రేపుతోంది. అధికారులు, డాక్టర్ల సమన్వయ లోపంతో కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ రావచ్చంటున్నారు డాక్టర్లు. అయితే దీని తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని.. అది రక్షణ ఇస్తుందని చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ డిమాండ్, సప్లయ్ మధ్య గ్యాప్ ఉందని వైద్యులు అంగీకరిస్తున్నారు. ఫస్టు డోస్ వేసుకున్న వారు, కచ్చితంగా సెకండ్ డోస్ వేసుకోవాలన్నారు. రెండు రోజులు అటు, ఇటు ఆయినా నష్టం లేదంటున్నారు. కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ ఒకవైపు టెస్టింగ్.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ  రెండూ జరుగుతున్నాయన్నారు. జనాలు జాగ్రత్తగా ఉండటమే కరోనా కట్టడికి మార్గమంటున్నారు డాక్టర్లు