ఆర్సీబీ ఆరంభం అదిరింది.. ముంబైపై 8 వికెట్ల తేడాతో గెలిచింది

ఐపీఎల్-16 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆరంభం అదిరింది. బేంగళూరు వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది.  

టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో 172 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బేంగళూరు 16.2 వోవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

బేంగళూరు ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లీలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డుప్లెసిస్ 43 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 73 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 49 బంతుల్లో  ఆరు ఫోర్లు, ఐదు సిక్స 82 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మొదటి వికెట్ కు ఇద్దరూ కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.  ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక్కడే రాణించాడు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu