రవితేజతో తమన్న,హన్సిక

 

బలుపు సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ ఇప్పుడ జోరు పెంచాడు.. తన సినిమాల  సక్సెస్ కోసం తానే చొరవ తీసుకుంటున్నాడు. స్టోరి నుంచి హీరోయిన్ సెలక్షన్ వరకు ప్రతి విషయంలో చాల కేర్ తీసుకుంటున్నాడు మాస్రాజ..  అందుకే తన నెక్ట్స్ సినిమాలో తన మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు మరిన్ని అందాలు ఉండేలా చూసుకుంటున్నాడు.

ఇన్నాళ్లు ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఈ మధ్యే ఫాం లోకి వచ్చాడు. బలుపు సక్సెస్‌తో జోరు మీదున్న మాస్‌ మహరాజ్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలోలా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా ఇప్పుడు స్క్రీప్ట్‌ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాడు.

బలుపు సినిమా తరువాత కాస్త గ్యాప్‌ తీసుకున్న మాస్‌ మహారాజ్‌ ఇప్పుడిప్పుడే సినిమాలు ఒకే చేస్తున్నాడు. బలుపు సినిమాకు కథ రచయిత అయిన బాబి డైరెక్షన్‌లో ఇప్పటికే ఓ సినిమాను ఒకే చేశాడు. వైవియస్‌ చౌదరి నిర్మిస్తున్న ఈసినిమా ఈ నెలఖరునుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు వైవియస్‌ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో వీరి కాంభినేషన్‌లో వచ్చిన నిప్పు సినిమా డిజాస్టర్‌ అయింది. దీంతో నష్టాల పాలయిన వైవియస్‌ను ఈసినిమా తో ఆదుకోవాలనుకుంటున్నాడు రవితేజ.

అంతేకాదు ఈ సినిమా ఎలాగైన సక్సెస్‌ చేయటం కోసం సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్‌ చేస్తున్నాడు రవితేజ.  ఇంతవరకు రవితేజతో జోడి కట్టని ఇద్దరు అందాల భామలను ఈ సినిమాలో హీరోయిన్లుగా సెలక్ట్‌ చేశాడు.

తెలుగులో సూపర్‌ ఫాంలో ఉన్న తమన్నాతో పాటు, తమిళ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న హన్సికను తన నెక్ట్స్‌ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నాడు రవితేజ. తన ఫాంతో పాటు తమన్న, హన్సికల లక్‌ కూడా తొడై ఈ సినిమా ఘన విజయం సాదిస్తుందని ఆశపడుతున్నాడు.

    మరి ఈ అందాల భామ కాంభినేషన్‌ మాస్‌ మహరాజ్‌ ఫాంను కొనసాగిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu