శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్
posted on Aug 22, 2025 3:28PM

శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై క్రిమినల్ ఇన్వెస్టిషన్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేశారు. 2023లో ఆయన విదేశీ పర్యాటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. మొత్తం 10 మంది ప్రమేయం ఉందని సీఐడీ పేర్కొంది. ఆయన వ్యక్తిగత లండన్ పర్యటనకు రూ. కోటీ 70 లక్షల ప్రభుత్వ నిధులు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2023లో ఆయన లండన్ పర్యటనకు వెళ్లారు. ఆ అంశానికి సంబంధించిన కేసులో విక్రమసింఘేను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ యూనివర్సిటీలో విక్రమసింఘే భార్యను సత్కరించే కార్యక్రమం కోసం ఆయన వెళ్లారు. విక్రమసింఘేను కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు అధికారి తెలిపారు. వ్యక్తిగత కారణాల కోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. 2022లో గోటబయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత విక్రమసింఘే అధ్యక్ష పదవిని చేపట్టారు. 2024లో ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.