రాజమోళిని పొగిడిన రాంగోపాల్ వర్మ..

 

ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మ అందరి మీద విమర్శల బాణాలు వేస్తునే ఉంటారు. మొన్న టీచర్స్ డే సందర్భంగా ఆఖరిని వారిని కూడా వదలకుండా విమర్శించేశాడు. ఇప్పుడు ఆయన కన్ను రాజమౌళి మీద పడింది. రాజమౌళిని ఉద్దేశించి ట్విట్టర్లో కొన్నిపోస్ట్ లు చేశాడు. ఏముంది ఏదో విమర్శిస్తూ కామెంట్ చేశాడనుకుంటున్నారు.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే ఇంతకీ రాంగోపాల్ వర్మ ఏమని వ్యాఖ్యానించాడనే కదా డౌట్.

"I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg''

అంటే రాజమౌళిలో ప్రస్తుతం స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్నానని కామెంట్ చేశాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ హాలీవుడ్ డైరక్టర్.. ఆయన పోలికలు రాజమౌళిలో ఉన్నాయనే విధంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంపై ఫ్యాన్సందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ రూట్ మార్చినట్టున్నాడు.