గొట్టిపాటి లక్ష్మి వైపే దర్శి.. గెలుపు సునాయాసమే!

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తొలుత జనసేనకు కేటాయించాలని భావించినప్పటికీ, తరువాత మాజీ మంత్రి సిద్ధారాఘవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆ స్థానాన్ని ఆయనకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే తరువాత ప్రత్నమ్నాయ అభ్యర్థి కోసం గాలించింది.

ఆ గాలింపులో భాగంగా దర్శినియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి వచ్చారు. దీంతో దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు గొట్టిపాటి లక్మికి అదనపు బలంగా మారింది. నియోజకవర్గంలో అన్ని వర్గాల వారూ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నారు. కూటమి పట్ల మహిళలు, వృద్ధులు సైతం ఆసక్తి కనబరచడం గమనార్హం. కూటమి సభలకు మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోటెత్తుతున్న జనం తెలుగుదేశం శ్రేణులలో జోష్ పెంచుతున్నది.

అన్నిటికీ మించి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్థులను చేస్తున్నారు.  స్పష్టమైన హామీలు ఇవ్వడమే కాకుండా, వైసీపీ పాలనా వైఫల్యాలను సూటిగా సుత్తి లేకుండా ఎండగడుతున్న తీరు ప్రజలను ఆకర్షిస్తోంది. కష్టపడి పని చేసే తత్వం, ప్రజలలో మమేకం అవుతున్న తీరు  గొట్టిపాటి లక్ష్మికి సానుకూలాంశాలుగా మారాయి. ప్రజలలో ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. మరో వైపు  ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి దశాబ్దాల రాజకీయ అనుభవం, నియోజకవర్గ పరిధిలో ఆయనకు వివిధ వర్గాల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ తెలుగుదేశం గూటికి చేరేలా చేశాయి. ఇది దర్శిలో తెలుగుదేశం అవకాశాలను మరింతగా పెంచింది. ఈ పరిణామాలతో దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం బలం అనూహ్యంగా పెరిగింది. దీంతో పరిశీలకులు సైతం దర్శిలో గొట్టిపాటి లక్ష్మి విజయం నల్లేరుమీద బండినడకలా మారిందని విశ్లేషిస్తున్నారు.