లడ్డూ కల్తీ నిజమే... రమణ దీక్షితులు

తిరుమల ప్రసాదాలలో కల్తీ నిజమేనని తిరుమల తిరుపతి  దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ కల్తీ ప్రసాదమే గత ఐదేళ్లుగా అంటే జగన్ హయాంలో మహాప్రసాదంగా చెలామణి అయిపోయిందన్నారు. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం గురించి తాను పలుమార్లు  అప్పటి టిటిడీ చైర్మన్లు, ఈవో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. తిరుమలను ప్రక్షాళన చేస్తానని చెప్పిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకుంటున్నారన్నారు. తిరుమలలో అపచారాలపై విజిలెన్స్ నివేదిక అక్షర సత్యమని రమణదీక్షితులు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu