చిరంజీవి భజనలో తరిస్తున్న దేవాదాయ శాఖా మంత్రి
posted on May 5, 2013 9:15AM
.jpg)
మన మంత్రులకి పాలనా వ్యవహారాలూ చూసుకొనే తీరిక, ఆసక్తి లేకపోయినా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకి, శంకు స్థాపనలు చేయడానికి, స్వంత వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి మాత్రం మంచి ఆసక్తి కనబరుస్తారు. నిన్న విశాఖలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి విశాఖ-భీమిలి బీచ్ కారిడార్ పనులకు శంకు స్థాపన చేసినప్పుడు బొత్స శ్రీనివాస రావు, టీ.సుబ్బిరామి రెడ్డి, ద్రోణంరాజు మరియు ఆయన అనుచరులయిన మంత్రులు గంట శ్రీనివాస రావు, రామచంద్రయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరయిన మంత్రులందరూ వారికి అబిరుచి ఉన్న విషయాలపై అంటే చిరంజీవికి కాంగ్రెస్ అధిష్టానంతో తనకున్న సంబందాల గురించి, బొత్ససత్యనారాయణ జగన్, చంద్రబాబుల గురించి మాట్లాడితే, చిరంజీవి భజనమండలిలో ప్రధాన సభ్యుడయిన దేవాదాయ శాఖా మంత్రి రామచంద్రయ్య ఈ వేదిక మీద ఉన్నవారికి బాధ కలిగించే విషయం చెపుతున్నానంటూ “చిరంజీవి గారు! ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ మీ వైపే చూస్తున్నారు. మీరూ బొత్స కలిసి రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు కోరుకొంటున్నారు,” అని అన్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో తప్పుకొంటే లేదా తప్పించబడితే వారిరువు కలిసి రాష్ట్రాన్ని ఏలాలన్నమాట. వారిలో ఏ ఒక్కరూ కూడా ఈ బీచ్ కారిడార్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కానీ, దాని రూపు రేఖల గురించి గానీ ప్రస్తావించలేదు. ఎవరి గోల వారిదే నన్నమాట!