మాజీ ముఖ్యమంత్రి మృతి

 

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రామ్ సుందర్ దాస్ హోలీ రోజున పాట్నాలో మరణించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. రామ్ సుందర్ దాస్ 1979 నుంచి 1980 వరకు తొమ్మది నెలల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన బీహార్‌కి 18వ ముఖ్యమంత్రి. వయోభారం వల్ల కలిగిన అనారోగ్యంతో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆయన జనతాదళ్ (యునైటడ్)కి చెందిన నాయకుడు. గతంలో హాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పలుపర్యాయాలు పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. 2014 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఆయన హాజీపూర్ స్థానానికి రామ్ విలాస్ పాశ్వాన్‌ మీద పోటీకి నిలిచారు. అయితే నరేంద్రమోడీ హవా కారణంగా ఆయన ఓడిపోయారు. మోడీ గాలి వీచకుండా వుంటే ఆ వయసులో కూడా ఆయన విజయం సాధించేవారని రాజకీయ వర్గాలు భావించాయి. రామ్ సుందర్ దాస్ మరణం పట్ల పలువురు జాతీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.