ఉత్తరాఖండ్: చరణ్, బన్నీ చెరో 10లక్షల సాయం
posted on Jul 2, 2013 12:37PM

‘ఎవడు’ ఆడియో వేదిక సాక్షిగా ఉత్తరాఖండ్ వరద బాధితులకు హీరోలు అల్లు అర్జున్, మెగా తనయుడు రాంచరణ్ తేజ ఇద్దరూ చెరో పది లక్షల రూపాయలు సహాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆడియో వేదిక మీద కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి అందజేశారు. ఇంతకు ముందు హీరో పవన్ కళ్యాణ్ 25 లక్షల రూపాయలు వరద సహాయం ప్రకటించారు. నా పిలుపు మేరకు ఇలా స్పందించడం ఆనందంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలలో చిక్కుకున్న వారిని ఆదుకోవడం మన కర్తవ్యం. వారి ఆదుకునేందుకు సహాయం చేయడం అభినందనీయం. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ రూ.25 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు చెర్రీ, బన్నీలు చెరో పది లక్షలు ఇచ్చారు. అభిమానులు కూడా సహాయం చేయడం సంతోషంగా ఉంది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేస్తానని చిరంజీవి తెలిపారు.