ఒకే వేదికపై కమల్, రజనీకాంత్...ఇంట్రస్టింగ్ గా తమిళ రాజకీయాలు..

 

తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పన్నీర్ సెల్వం.. పళని స్వామి ఏకమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరో వార్త తమిళనాట హల్ చల్ చేస్తుంది. త‌మిళ ప్ర‌జ‌లు ఆరాధించే న‌టులు క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌లు ఏకమవుతారా అని.. ఎందుకంటే.. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌లు ఇవాళ సాయంత్రం ఒకే వేదిక‌పై క‌నిపించ‌నున్నారు. త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే త‌మ పార్టీ పత్రిక `ముర‌సోలి` ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ఈవెంట్ లో క‌మ‌ల్‌, ర‌జ‌నీలు పాల్గొన‌నున్నారు. దీంతో ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అధికార‌ప‌క్షం అన్నాడీఎంకేపై వీరిద్దురూ ఎప్ప‌ట్నుంచో వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక పక్క కమల్... మరోవైపు  పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి కొద్ది కాలంగా ఊరిస్తున్న ర‌జ‌నీకాంత్ ఈ కార్యక్రమానికి రానుండటంతో త‌మిళ రాజ‌కీయాలు మారే అవకాశం ఉందా అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వేదిక మీద ర‌జనీకాంత్ ఎలాంటి ప్ర‌సంగం చేయ‌బోర‌ని తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో..?