ఇకపై ఏటీఎంలలో రూ.500, రూ.2వేల నోట్లు రావు..

 

దేశంలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి కేంద్రప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. ఇక నోట్లరద్దు అనంతరం.. ఆర్బీఐ పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. నోట్లరద్దు తరువాత ఏటీఎంల వాడకం తగ్గిందనే చెప్పొచ్చు. ఏటీఎంలలో డబ్బు లేకపోలడం వల్ల కావచ్చు.. ఏటీఎంల దగ్గర లైన్లలో నిల్చోలేక కావచ్చు కానీ.. అందరూ ఆన్ లైన్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. దీంతో ఏటీఎంల వాడకం దాదాపు తగ్గింది. అంతేకాదు ఏడాదిగా ఏటీఎంల వాడకం కూడా తగ్గించినట్టు తెలిసింది. దీంతో ఏటీఎంల వినియోగం తగ్గించి ఆన్ లైన్ లావాదేవీలు పెంచేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ మరో నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ద్వారా అక్టోబర్ నుండి రూ.500, రూ.2వేల నోట్లు ఏటీఎంల ద్వారా పొందే అవకాశం లేదు. కేవలం రూ. 100 నోట్లు మాత్రమే వస్తాయట. ఇక కొత్తగా వచ్చే రూ.200 నోటు కూడా బ్యాంకు ద్వారానే ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మరి ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంకెన్ని సమస్యలొస్తాయో చూద్దాం...