రజనీతో మణిరత్నం కొత్త సినిమా
posted on Nov 29, 2012 6:56PM

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ తన కూతురు తీస్తున్న యానిమేషన్ ఫిల్మ్ తో బిజీగా ఉన్నారు. పుట్టిన రోజుకి త్రీడీ శివాజీతో హల్ చల్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ్. విక్రమ్ సింహా ఎంత త్వరగా విడుదలవుతుందా అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.
రజనీ త్వరలోనే మణిరత్నంతో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడన్న వార్త కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా ఇరవై రెండేళ్లక్రితం రజనీ మణిరత్నంల కాంబినేషన్ లో వచ్చిన దళపతి సూపర్ హిట్టయ్యింది.
ప్రస్తుతం కడల్ సినిమాతో బిజీగా ఉన్న మణిరత్నం తన తర్వాత ప్రాజెక్ట్ కింద రజనీ సినిమాని టేకప్ చేస్తున్నాడని ప్రచారం జోరుగా జరుగుతోంది. చేస్తున్న సినిమా పూర్తి కాగానే.. 2013లో రజనీతో కొత్త సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట కూడా..