ఏపీని వదలని వానలు
posted on Dec 18, 2024 7:29AM

జనవరి నెల సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదలడం లేదు. బంగాళా ఖాతంలో ఏర్పడుతున్నవరు అప్పపీడనాలతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన అప్పపీడనం రానున్న రెండు రోజుల్లో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలలో ఓ మోస్తరు నుంచి భీరా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, నెల్లూరులలోనూ, తూర్పుగోదావరి జిల్లాలలోనూ మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.