ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఫేస్‌బుక్..

ఫేస్‌బుక్ లేకుండా క్షణం కూడా గడపలేదు నేటి యువత. బాధను, సంతోషాన్ని, ఆనందాన్ని.. ప్రతీ చిన్న విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా సన్నిహితులతో పంచుకోవడం యువత జీవితంలో భాగమైపోయింది. అలాంటి ఫేస్‌బుక్ కాసేపు పనిచేయకపోతే.. అచ్చం ఈ పరిస్థితినే ఎదుర్కొన్నారు నేటిజన్లు. నిన్న రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అమెరికా, మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో పాటు మనదేశంలోని వినియోగదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఫేస్‌బుక్ హెల్ప్‌లైన్‌కి భారీగా ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన నిపుణులు గంటల్లోనే సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకొన్నారు.