అందుబాటులోకి రైల్ వన్ యాప్.. సింగిల్ లాగిన్ తోనే సమస్త సేవలు
posted on Jul 2, 2025 10:12AM

రైలు ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూసే.. రైల్వే ప్రయాణీకులు సమాచారం కోసం ఇప్పటి వరకూ వేర్వేరు యాప్ లను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే తాజాగా రైల్వే శాఖ తాను అందించే సేవలన్నిటికీ సింగిల్ విండో సిస్టమ్ లాంటి యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్ వన్ పేరుతో ఆల్-ఇన్-వన్ సూపర్ యాప్‌ను కేంద్ర రైల్వే మంత్రి ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా కౌంటర్ల వద్ద క్యూ లైన్ల సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందని రైల్వే శాఖ చెబుతోంది. అంతే కాకుండా..
రైల్ వన్ యాప్ ప్రయాణికులకు సమగ్రమైన సేవలను అందిస్తుంది. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను ఇప్పుడు యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్లాట్ ఫారమ్ టికెట్లను సైతం కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా జరిగే రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్ యథాతథంగా కొనసా గుతుంది. అలాగే ప్రయాణికులు సింగిల్ లాగిన్‌తో తమ రైలు రన్నింగ్ స్టాటస్, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోనే వీలు ఈ యాప్ ద్వారా కలుగుతుంది. ప్రయాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే, రైల్ మదద్ ఫీచర్ ద్వారా యాప్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో కి వచ్చింది. భవిష్యత్ లో ప్రాంతీయ భాషలను కూడా చేర్తుస్తారు. ఈ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది.