బీజేపీకి మద్దతు ఇస్తాం!!! - రాహుల్ గాంధీ 

 

బీజేపీ, కాంగ్రెస్ ఆజన్మ శత్రువులు అలాంటిది బీజేపీకి రాహుల్ మద్దతు ఏంటి అనుకుంటున్నారా?.
బీజేపీకి రాహుల్ మద్దతు ఇస్తా అన్నది ఎనిమిదేళ్లుగా నోచుకోని మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం కొరకు. పార్లమెంట్ మరియు అసెంబ్లీ లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా 2008 లో 108 వ రాజ్యాంగ సవరణ చేసారు. ఆ సవరణ 9 మార్చ్  2010  న  రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ అదే బిల్ ఇప్పటి వరకు లోక్ సభలో ఆమోదం పొందలేదు.తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్ పెడితే మా మద్దతు మీకు ఉంటుందని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి మోడీకి తెలియజేసారు. అంతేకాక ఎనిమిదేళ్లుగా ఆగిన మహిళా బిల్ కి  మద్దతుగా 3.2 మిలియన్ సంతకాల సేకరణ చేశామని తెలిపారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu