స్వచ్ఛ భారత్... రాహుల్ విషం
posted on Nov 13, 2014 9:16PM

స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సమాజంలో విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ ఆ కార్యక్రమం మీద విషం చిమ్మారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే కార్యక్రమమేనని ఆయన అన్నారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని రాహుల్ ఆవేదనపడిపోయారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో సోనియాగాంధీ, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆవేశంగా మాట్లాడారు. శాంతి, ప్రేమ ద్వారానే స్వాతంత్రాన్ని సాధించుకున్నామని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం నాలో వున్న కోపాన్నంతా ప్రేమగా మార్చుకున్నాను. అందుకు కారణమైన వారందరికి నా ధన్యవాదాలు అని రాహుల్ అన్నారు.