రూపాయి పతనం..బ్రేకింగ్‌ న్యూస్‌ కాదు.. బ్రోకెన్‌ న్యూస్‌.

 

అవకాశం దొరికిందే తడవు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం,మోడీ పాలనపై విరుకుపడుతున్నారు.తాజాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనంత దారుణంగా పతనం కావడంపై ట్విట్టర్ వేదికగా రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.'బ్రేకింగ్‌ రూపాయి విలువ 73.67 వద్ద కొనసాగుతోంది. ఇది బ్రేకింగ్‌ న్యూస్‌ కాదు. బ్రోకెన్‌ న్యూస్‌’ అని ట్వీట్‌ చేశారు.మరో ట్వీట్‌లో ‘ రూపాయి పతనం స్పందించాల్సిన వారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వారు పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం వారంతా రైతులపై ప్రతాపం చూపే పనిలో బిజీగా ఉన్నారు. పతనంపై ఎవ్వరూ మాట్లాడకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనం’ అంటూ ట్వీట్‌ చేశారు.

రూపాయి పాతాళానికి పడిపోయినా ప్రధాని మోదీ నోరు విప్పకపోవడంపై రాహుల్ మండిపడ్డారు. 'రూపాయి 73 మార్కును దాటేసింది. దీంతోపాటు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు, ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతూ ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 56 అంగుళాల ఛాతీ కలిగిన వారు ఇప్పటికీ ‘సైలెంట్ మోడ్‌’లోనే ఉన్నారు. ఇక అచ్ఛేదిన్‌ ఊసే లేదు’ అంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు.