తులసిబాబు బెయిల్ పిటిషన్.. RRR ఇంప్లీడ్

తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులకు శిక్ష పడే  విషయంలో  మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్వయంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టే విషయంలో పోలీసులు గట్టిగా ప్రయత్నించడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రఘురామ కృష్ణం రాజు.. ఈ కేసులో స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత అరెస్టైన తులసిబాబు హైకోర్టులో అత్యవసర బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే తులసిబాబు విషయంలో పోలీసులు   గట్టిగా నిలబడతారన్న నమ్మకం లేకపోవడమో, లేదా తనకు జరిగిన అన్యాయాన్ని తనకంటే గట్టిగా ఎలుగెత్తే వారెవరుంటారన్న భావనో కానీ ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. 

ఈ కేసులో అరెస్టైన తులసీబాబు హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్  విచారణ సందర్భంగా తన వాదనా వినాలంటూ రఘురామకృష్ణం రాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తులసి బాబు తాను కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేశారనీ, అందుకే ఆయన బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా తన వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.   కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో రఘురామకృష్ణం రాజు అలుపెరుగని న్యాయపోరాట ఫలితంగానే ఈ కేసులో విజయ్ పాల్, తులసిబాబు అరెస్టయ్యారని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు తులసి బాబు బెయిల్ పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన రఘురామకృష్ణం రాజు పీస్ సునీల్ జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అరెైస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభావతి ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu