జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఫర్ సేల్!?

ఆంధ్రప్రదేశ్ ఊడిపోయిన, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో కొంత తన సొమ్ముతో, చాలా జనం సొమ్ముతో కట్టించుకున్న ‘తాడేపల్లి ప్యాలెస్’ని అమ్మకానికి పెట్టే ఆలోచనలు జరుగుతున్నాయని అభిజ్ఞవర్గాల భోగట్టా. నేను ముఖ్యమంత్రిని అయ్యాక అమరావతి రాజధానిగా అద్భుతంగా పరిపాలించేస్తాను అని చెప్పి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు జగన్. ఆ ఇంటి గృహప్రవేశం సందర్భంగా వైసీపీ వాగుడుకాయలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని మార్చేస్తారని చంద్రబాబు చెబుతున్నారు. రాజధాని మార్చేపనయితే ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? అని పిచ్చి లాజిక్ ఒకటి చెప్పి జనాన్ని నమ్మించారు. చివరికి ఏమైంది. జగన్‌ ఇల్లయితే కట్టుకున్నారుగానీ, అమరావతిని ధ్వంసం చేసిపారేశారు. తాడేపల్లిలో తన ఇల్లు కళకళలాడుతూ వుందిగానీ, అమరావతే ఘోస్ట్ సిటీగా మారిపోయింది. అందరికీ ఓ టైమ్ వస్తుంది. ఇప్పుడు జగన్‌కీ ఓడిపోయే టైమ్ వచ్చింది. ఈ ఎన్నికలలో వైసీపీ ఓటమి కన్ఫమ్ అయిపోయింది. ఓడిపోయిన తర్వాత జగన్‌కి తాడేపల్లిలో పనేం లేదు.  ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన ఒక్కడి రాజధాని వైజాగ్‌లోనే వుండొచ్చు. లేదా హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోనే, బెంగళూరు ప్యాలెస్‌లోనే వుండొచ్చు. అంతే తప్ప తాడేపల్లిలో వుండటానికి ముఖం చెల్లదు కదా..

తాడేపల్లి ప్యాలెస్ కట్టే సమయంలో జగన్ నిబంధనలు సక్రమంగా పాటించలేదు. తవ్వి తీయాలేగానీ, ఎన్నో లొసుగులు బయటపడే అవకాశం వుంది. జగన్ అధికారం చేపట్టిన వెంటనే నిక్షేపం లాంటి ప్రజావేదికని కూల్చి విధ్వంసానికి అంకురార్పణ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వంలాగా ఆలోచించి జగన్ తరహా విధ్వంసాన్ని జగన్ ప్యాలెస్ నుంచే ప్రారంభిస్తే పరిస్థితి ఎలా వుంటుందోన్న భయం వైసీపీ వర్గాల్లో వున్నట్టు సమాచారం. చంద్రబాబు మనలాంటి విధ్వంసకారి కాదు అనే ధైర్యం వున్నప్పటికీ, ఎందుకైనా మంచిదనే ధోరణితో తాడేపల్లి ప్యాలెస్‌ని మెల్లగా వదిలించుకుంటే మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జగనన్నకి పనేమీ లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆస్తి ఎందుకనే ఆలోచనలో కూడా వున్నట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News