జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పీవీ సింధు

స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్ సాధించిన ఏస్ షట్లర్ సింధుకు ఈ అవకాశం లభించింది.

అలాగే తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కూడా మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. మొత్తంగా ఈ  సలహాకమిటీకి  21 మంది సభ్యులు ఎంపిక కాగా.. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం విశేషం. జాతీయ మహిళా కమిషన్  చైర్ పర్సన్ విజయా కిశోర్ రహట్కర్ నేతృత్వంలో  ఈ కమిటీ పని చేస్తుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu