వియ్యంకుడు వద్దు పార్టీనే ముద్దు...!
posted on Mar 9, 2019 11:13AM

ఏపి ముఖ్యమంత్రి..తెలంగాణ ముఖ్యమంత్రి ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేతల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల వేళ..బంధుత్వాల కంటే తమ పార్టీ గౌరవమే ముఖ్యమని చాటుతున్నారు. తెలంగాణ మంత్రి తలసాని..టిటిడి ఛైర్మన్ పుట్టా సుధకార్ యాదవ్ ఇద్దరూ వియ్యంకులు. తలసాని గత కొంత కాలంగా చంద్రబాబును టార్గెట్ చేయటం పుట్టాకు ఇబ్బంది గా మారింది. తలసాని.. ఇటీవల ఏపీలో పర్యటనకు వచ్చి.. చంద్రబాబు పై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వియ్యంకుడి వ్యవహార తీరుపై పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. ‘‘చంద్రబాబు రాజకీయ భిక్షతోనే ఈ స్థాయికి ఎదిగావు. దానిని మరిచిపోయి ఆయన్నే విమర్శించడం తగదు’’ అంటూ... మంత్రి తలసాని యాదవ్‌కి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీలకు అన్యాయం చేసిందంటూ మాట్లాడటం తగదని తలసానికి హెచ్చరించారు. తనకు తలసాని వియ్యంకుడు అయినప్పటికీ.. చంద్రబాబుని విమర్శిస్తే ఊరుకోనని సుధాకర్ అన్నారు.