పిఎస్ఎల్‌వి-సి 24 : కౌంట్‌డౌన్ షురూ!

 

 

 

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన పిఎస్ఎల్‌వి-సి 24 లాంచ్ చేయడానికి సిద్ధంగా వుంది. ఈనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 58 గంటల 30 నిమిషాల తర్వాత కౌంట్‌డౌన్ ముగుస్తుంది. మన దేశంలో నావిగేషన్ సిస్టమ్ సేవలను అందుబాటులోకి తేవడానికి అవసరమయ్యే ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.