ప్రసిద్ధ రచయత కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరు

ప్రముఖ కవి, రచయత కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.  ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఆయన సోమవారం (మే22) ఉదయం తుది శ్వాస విడిచారు.   అభ్యుదయ రచయలత సంఘం అధ్యక్షుడిగా కొంత కాలం పని చేసిన కేతు విశ్వనాథ్ రెడ్డి  జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు  కథా సంపుటులు  వెలువరించారు.

ఈయన కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్‌ భాష ల్లోకి అనువాదమయ్యాయి. వేర్లు, బోధి అనే రెండు నవలలు కూడా రాశారు.  అంతే కాకుండా   ఆయన రాసిన సాహితీ వ్యాసాలు దృష్టి పేర పుస్తక రూపంలో వచ్చాయి.

ఆయనను కేంద్ర సాహిత్య అకాడమీ సహా పలు పురస్కారాలు వరించాయి. కడప జిల్లా గ్రామ నామాలుపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పొందారు. ఆయన మృతి పట్ల పలువురు సాహితీ వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu