ఆపరేషన్ కగార్ సక్సెస్.. ప్రొఫెసర్ హరగోపాల్
posted on Nov 19, 2025 9:52AM

నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయ్యిందని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నవంబర్ 18) మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై స్పందించిన హరగోపాల్ హైదరాబాద్ లో మాట్లాడుతూ.. పార్టీలోని భిన్నాభిప్రాయాలు, విభేదాల వల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాజ్యంలోని మార్పులు, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి సపోర్ట్ లేక పోవడం కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు. కేంద్ర కమిటీ నేతలు.. ప్రభుత్వం ఎదుట లొంగుబాటుకు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, కారణాలు ఉన్నాయన్నారు. మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనా ఆదివాసీల ఉద్యమాలు మాత్రం ఆగవని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.