కోదండరామ్ అడుగు ఎటు.. ప్రతిపక్షంగానా? అధికారపక్షంగానా?

 
 
జేఏసీ సారధి కోదండరామ్ రెడ్డి ఇక నుండి ఫుల్ ఫ్రీగా ఉండబోతున్నారు. అంటే ఈ నెలాఖరున తాను తన ప్రొఫెసర్ వృత్తి నుండి రిటైర్ అవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు కోదండరామ్ రిటైర్ అయిన తరువాత ఏం చేస్తారు అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన కోదండరామ్.. ఆతరువాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత తన ప్రొఫెసర్ వృత్తినే సాగిస్తూ అప్పుడప్పుడు తెలంగాణ ప్రజల సమస్యల గురించి అధికార పార్టీని ప్రశ్నించేవారు. గతంలో కూడా కోదండరామ్ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేరే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి వార్తలు గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు కోదండరామ్ రిటైర్ అయిన తరువాత తాను ప్రతిపక్షనేతగా ఉంటారా లేక అధికార పక్షానికి దగ్గరవుతారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 
 
ఇదిలా ఉండగా మరోవైపు ఆయన అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశమే లేదనే వార్తుల కూడా వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ప్రజా సంఘాలతో సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలకోసం పోరాడుతారని అనుకుంటున్నారు. మరోవైపు కోదండరామ్ కూడా అడుగు ఏటు వేయాలో తెల్చుకోలేకపోతున్నారుట. దీనికి సంబంధించి మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నా ఆయన మాత్రం ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నారట. మరి కోదండరామ్ అడుగు ఎటు పడుతుందో ..ఆయన ప్రతిపక్షంగా ఉంటారా? లేక అధికార పక్షంగా ఉంటారో చూడాలంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu