వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి నీటి విడుదల

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది  వరద నీటితో పోటెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న అన్ని డ్యామ్ ల గేట్లనూ ఎత్తి అధికారులు లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఇప్పటికే మూడు సార్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

తాజాగా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి మరోసారి కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల 12, శ్రీశైలం 4, నాగార్జున సాగర్ 24, టైల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులుఎత్తివేశారు. దీంతో దిగువన విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజి వద్దకు భారీగా వరద నీరు చేరింది  బెజవాడ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ప్రకాశం బ్యారేజీ  గేట్లు ఎత్తివేసి దిగువకు విడుదల చేశారు.  దీంతో  విజయవాడ దిగువన ఉన్న లంక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికారులు  లంకగ్రామ ప్రజల  అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu