కరెంటు బిల్లుల్ని చూసి ప్ర‌జ‌లు గుడ్లు తేలేస్తున్నారు! కరెంటు షాక్!

లిక్కర్‌ దెబ్బతో రాష్ట్ర ఖజనాని నింపుకుంటూ, మందు బాబుల పొట్ట కొడుతున్న ప్రభుత్వాల క‌న్ను ఇప్పుడు కరెంటు బిల్లుల మీద పడింది. కరోనా వైరస్‌ కారణంగా ఓ నెల రీడింగులు తీయకపోవడంతో, శ్లాబ్‌లు మారిపోయాయి. అదొక్కటే కారణం కాదు.. ఇతరత్రా కారణాలు కూడా కలిసి బిల్లులు వాచిపోతున్నాయి.. దాంతో, సామాన్యుడి నడ్డి విరిగిపోతోంది.

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. క‌రోనా కార‌ణంగా బాగా ఆల‌స్యం జ‌రిగింది. దీంతో శ్లాబ్‌ల లెక్క మారిపోయింది. 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్క‌డే వుంది టెక్నిక్‌.

ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా అంటే మూడు రూపాయ‌ల 60 పైస‌ల స్లాబ్ నుంచి ఆరు రూపాయ‌ల తొంభై పైస‌ల స్లాబ్‌లో బ‌ల‌వంతంగా చేరాల్సి వ‌స్తోంది.

లెక్క ఇలా వుంటోంది. కేవ‌లం రెండు రోజులు ఆల‌స్యంగా బిల్ రీడింగ్ చేయ‌డం వ‌ల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది.

ఇప్పుడే మొదలైంది అసలు మజా... ముందుంది మరింత వాయింపుడు వ్యవహారమంటూ, ఆర్టీసీ ఛార్జీలు సహా.. ఇతరత్రా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu