బండి సంజయ్ దీక్ష భగ్నం

టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద చేపట్టిన నిరసనను పోలీసులు భగ్నం చేశారు.  టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేశారు.

ఆయనతో పాటు  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అలాగే అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయింపు కార్యక్రమం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్లను అక్కడ నుంచి తొలగించే సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి సృహతప్పి పడిపోయాడు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu