కోడెల వర్ధంతి కార్యక్రమాలపై పోలీసుల నోటీసులు.. ఆపేది లేదంటున్న కుమారుడు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మొట్టమొదటి వర్ధంతి రేపు బుధవారం నాడు జరగనుంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దివంగత నేత కోడెల అనుచరులు పలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క కోడెల కుమారుడు శివరాం కూడా కొన్ని కుటుంబ పరమైన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కోడెల శివరాం తో సహా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

 

అయితే పోలీసుల తాజా వైఖరిపై కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు యథావిధిగా తాము కార్యక్రమాలు చేపట్టి తీరుతామని కోడెల శివరామ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కుటుంబ పరంగా జరిగే వర్ధంతి కార్యక్రమాలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం సరికాదని అయన అభిప్రాయపడ్డారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏడాది క్రితం హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu