కౌశిక్ రెడ్డిపై కేసు... విధులకు ఆటంకం కలిగించినందుకే
posted on Sep 13, 2024 11:05AM
తెలంగాణ రాజకీయాలు మరోమారు రంజుగా మారాయి. కాంగ్రెస్ , బిఆర్ఎస్ నేతల మాటలు ఉద్రిక్తతకు దారితీసాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల మధ్య గత వారం రోజులుగా జరుగుతున్న మాటలయుద్దం చర్చకు దారితీసాయి.. నిన్న అరికెపూడిగాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఎగరేస్తానని సవాల్ చేసిన కౌషిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ అయ్యారు. బిఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు నివాసంలో నుంచి బయలు దేరబోతున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అనుమతి ఇచ్చిన పోలీసులు తనకు ఎందుకు ఇవ్వడం లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మా ఎమ్మెల్యేను నేను కలిస్తే మీకు ఇబ్బంది ఏమిటి? అరికెపూడి నన్ను లంచ్ కు పిలిచాడు వెళ్లనివ్వండి అని కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ విధులకు ఆటంకం కలిగించినందుకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.