సుదీర్ఘ ప్రసంగాల్లో మోదీ రికార్డు.. పతాకావిష్కణలో రెండో స్థానం
posted on Aug 15, 2025 12:24PM
.webp)
పరిపాలనలోనూ విదేశీ పర్యటనలు వంటి వివిధ అంశాలపై పలు రికార్డులను సృష్టించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు నెలకొల్పారు… స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించడంలోనూ తన రికార్డును తానే అధిగమించారు.. శుక్రవారం ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ 103 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు.
అంతకు ముందు ఏ ప్రధాని ఇంత సమయం ప్రసంగం చేయలేదు ..గత ఏడాది 98 నిషాలు ప్రసంగించిన మోదీ ఈసారి మరో 7 నిమిషాలు అధికంగా ప్రసంగించి తన రికార్డును తానే అధిగమించారు.. అలాగే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి వరుసగా 17 సార్లు ప్రసంగించారు.. మోదీ 12 సార్లు ప్రసంగించి మరో రికార్డును నెలకొల్పారు