రాజ్యాంగంపై మోడీ..నేను ఇవ్వడంలేదు.. సభ్యుడిగానే మాట్లాడుతున్నా.. మోడీ

 

పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా ఈ రోజు కూడా రాజ్యాంగపై చర్చ కొనసాగుతుంది. మహనీయులకు నావంతు నివాళి అర్పిస్తున్నానని.. రాజ్యాంగంపై అభిప్రాయాలు తెలియజేసిన సభ్యులందరికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కూజా రాజ్యాంగం పై మాట్లాడుతున్నారు. పార్లమెంట్ చరిత్రలోనే రాజ్యాంగంపై చర్చ ఒక ముసాయిదా అవుతుందని.. నేను చర్చకు జవాబు ఇవ్వడంలేదు..ఒక సామాన్య సభ్యుడిగానే మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవంబర్ 26 కు ఎంతో విశిష్టత ఉందని.. ప్రతి ఏడాది రాజ్యాంగం దినోత్సవంలో ఎలాంటి మార్పు చేయాలో ఆలోచిద్దామని సూచించారు. భిన్నత్వంగల భారత్ ను కలిపి ఉంచే శక్తి రాజ్యాంగానికి ఉంది.. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం మొదలైంది.. రాజ్యాంగంపై విద్యాసంస్థల్లో చర్చలు జరపాలి..రాజ్యాంగంపై ఆన్ లైన్ పోటీలు ఎందుకు పెట్టకూడదు? అని ప్రశ్నించారు.

ప్రతి ప్రధాని దేశాన్ని అభివృద్ధిచేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.. అన్ని ప్రభుత్వాల సహకారంతోనే దేశం అభివృద్ది సాధ్యమైందని.. కొన్ని ప్రభుత్వాలు ఆక్షాంక్షలకు తగ్గట్టు పనిచేయలేకపోవచ్చు అని మోడీ  అన్నారు. ఈ దేశాన్ని నిర్మించింది రాజులు, మహారాజులు కాదు.. దేశంలో ఉన్న విభిన్న వర్గాలు దేశాన్ని నిర్మించారు.. ప్రతి ఒక్క పౌరుడికి భాగస్వామ్యం ఉంది అని మోడీ పేర్కొన్నారు.