మరో 30 ఏండ్లు బీజేపీదే అధికారమట.. రాహుల్ కు షాకిచ్చిన పీకే..

ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారని అంటారు. అదేమో గానీ, కాంగ్రెస్ పార్టీతో, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే)స్నేహం వయసెంతోకానీ, ఆయనేమిటో ఈయనకు బాగా అర్థమైనట్లే వుంది. అందుకే,నిన్నమొన్నటిదాకా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి రాహుల్  గాంధీనే పెద్ద ప్రతిబంధకం, రోడ్డు బ్లాక్ అని తేల్చేశారు. ప్రదాని మోడీ పట్ల వ్యతిరేకతతో ప్రజలే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే భ్రమల్లో రాహుల్ గాంధీ, ఉన్నారని, కానీ అది జరిగేది కాదని స్పష్టం చేశారు.

“భారతీయ జనతా పార్టీ ఎక్కడికీ పోదు ... ఇంకా అనేక దశాబ్దాల పాటు దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటుది. అయితే రాహుల్ గాంధీతో వచ్చిన సమస్య ఏమంటే, ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని పడగొడతారనే భ్రమల్లో ఉన్నారు” అంటూ రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. పీకే ఇలా రాహుల్ గాంధీకి వాతలు పెట్టడం ఇటీవల కాలంలో ఇది రెండవ సారి.ఇటీవల రాహుల్ గాంధీ కంటే ప్రియంకా వాద్రా సమర్ధ నాయకురాలని అందుకే రాహుల్ గాంధీ ఆమె ఎదుగుదలను అడ్డుకుంటున్నారని, రాహుల్ ఇమేజ్’ను డ్యామేజి చేశారు.నిజానికి, రాహుల్ గాంధీ నాయకత్వ శక్తీ సామర్ధ్యాల విషయంలో,పీకేకు చాల క్లారిటీ ఉంది. అయినా ఇప్పుడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలోఈ వ్యాఖ్యలు చేయడం వెనక పీకే  మార్క్ వ్యూహం ఉందని అనుకోవచ్చును. 

పీకే చేసిన  వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకాగే, తృణమూల్ కాంగ్రెస్ గోవాలో కాలు మోపుతున్న సమయంలో పీకే చేసిన ఈ వ్యాఖ్య ఆయన కాంగ్రెస్’ పార్టీలో  చేరుతున్నారు అంటూ వస్తున్నఊహాగానాలకు కూడా తెరదించినట్లే అంటున్నారు. అయితే పీకే విషయంలో ఏదీ కూడా ఫైనల్ అనుకునే వీలులేదు... ఆయన దేన్నైనా తనకు అనుకులంగా మలచుకుంటారు. ఒక సారి చెపితే వందసార్లు చెప్పినట్లే అనే పిచ్చి సినిమా భ్రమలు ఆయనలో ఏ కోశానా ఉండవు, నిజానికి, ప్రశాంత్ కిశోర్’కు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ గురించి, రాహుల్ గాంధీ గురించి జ్ఞానోదయం అయింది, అనుకుంటే ఆది పోరపాటే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సమూలంగా భూస్థాపితం చేసి, ఆ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టించే వ్యూహంలో భాగంగానే ఆయన ఇంతకాలం ఒక ఫేక్ కహనీని తెరమీద చూపించారు. ఇప్పడు సమయం వచ్చే సరికి, కొత్త స్టొరీ ఎత్తుకున్నారు. 

నిజానికి బీజేపీకొన్నిదశాబ్దాల పాటు జాతీయ రాజకీయలకు కేంద్ర బిందువుగా ఉంటుందనే విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. అలాగే,కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అస్తమించే దశకు చేరుకుంది. ఇప్పడు బీజీపీ ఆస్థానాన్ని అక్రమించుకుంటోంది. సో .. స్వాతంత్రం తర్వాత 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ, ఓ వెలుగు వెలిగిందో,అదే విధంగా బీజేపీ 40 కాకపోతే 30 కాదంటే 50 ఏళ్ళు జాతీయ రాజకీయ యవనికపై నిలిచి ఉంటుంది, ఈ విషయాన్ని పీకే కంటే ముందు చాలా మంది చెప్పారు.అయితే ఈ సమయంలో అది కూడా తృణమూల్ తొలిసారిగా ఎన్నికల బరిలోకాలు పెడుతున్న గోవాలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనక, పీకే ప్లాన్ ఏమిటన్నదే కీలకం.