ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. షర్మిల ఫోన్ ట్యాప్!

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్‌లోనే తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేశారని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే షర్మిల కోసం ప్ర‌భాక‌ర్ రావు టీమ్ కోడ్ లాంగ్వేజ్ ఉప‌యోగించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 

ప్ర‌స్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నింధితుడుగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు విచార‌ణ ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత కాలంగా విదేశాల్లో ఉన్న ఆయ‌న ఇప్పుడు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు నివేధిక సిద్ధం చేశారు. నివేధిక ఆధారంగా ప్రభాకర్ రావుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.రేపు విశాక యిర్‌పోర్టులో ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల స్పందిచనున్నట్లు సమాచారం.