వంశీ కస్టడీ కోరుతూ పిటిషన్ తీర్పు పై ఉత్కంఠ

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో ఆయన రిమాండ్ ముగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వంశీని విచారించేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని  పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే పిటిషన్ పై విచారణ  దాదాపు ముగిసింది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో ఆసక్తికరంగా మారింది. 
ఇదిలావుండగా  గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. దీనికి సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో వంశీ పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో వంశీపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సంసిద్దంగా ఉన్నారు.