పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
posted on Jun 23, 2025 3:28PM
.webp)
వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 3.88 ఎకరాల భూమిని ఖాళీ చేయాలని మఠం ఈఓ ఉత్తర్వులివ్వగా పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
వీటిపై అభ్యంతరాలుంటే దేవదాయశాఖ ట్రిబ్యునల్‌కు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. నేటి నుంచి రెండు వారాల పాటు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగించింది