లడ్డూ వివాదంపై పీకే స్పందన

తిరుమ‌ల  ల‌డ్డూ ప్ర‌సాదం వివాదంపై జనసేనాని, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.    వైసీపీ హ‌యాంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన విషయంలో  అప్పటి టీటీడీ బోర్డు ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉందన్నారు. అలాగే దేశంలోని దేవాల‌యాలకు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించేలా జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.  సనాతన ధర్మాన్ని   అప‌విత్రం చేయ‌కుండా ఉండేలా సమష్టి కృషి అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu