‘అత్తారింటికి దారేది’ మళ్ళీ వాయిదా
posted on Aug 6, 2013 4:24PM
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది ’ సినిమా మళ్ళీ వాయిదా పడింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం అయితే ఈనెల 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సివుంది. కాని ఆతరువాత దీనిని ఈనెల 9కి వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి ఈ సినిమా వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ను త్వరలో ప్రొడ్యూసర్ ఖరారు చేస్తారని సమాచారం. కేంద్రం తెలంగాణ ఏర్పాటు పై ప్రకటన చేయడంతో ఇప్పుడు సీమాంద్ర ప్రాంతం నుండి విభజన సెగ తగులుతుంది. సమైక్య ఉద్యమం నడుస్తున్నవేళ సినిమాను విడుదల చేస్తే నష్టాలు చవిచూడాల్సిన పరిస్ధితి వస్తుందని, అలాగే సీమాంధ్ర జేఏసీ నుండి మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేయడం అంత సేఫ్ కాదని భావించే ఈ చిత్రాన్ని వాయిదా వేయిస్తున్నట్లు తెలుస్తోంది.