ఆంధ్రాకు కేంద్రం న్యాయం చేయాలి: పవన్ కళ్యాణ్

 

 పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ హడావుడిగా రాష్ట్రాన్ని విడదీయడం వలన తెలంగాణకు లాభం కలిగి ఉండవచ్చును. అందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ అదే సమయంలో ఆంద్రప్రదేశ్ కి తీరని అన్యాయం జరిగినందుకు నేను చాలా బాధ పడుతున్నాను. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్ర విభజన చేసాయి కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యతా వాటిదే. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ఆ రెండు పార్టీలకు చెందిన నేతలతో ఒక కమిటీ వేయాలి.

 

ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యెక వ్యవస్థని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో చొరవ చూపమని నేను ప్రధాని నరేంద్ర మోడీని ఈ మీడియాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్యలు మొగ్గలోనే ఉన్నప్పుడే తుంచి వేయాలి లేకుంటే ఇంతకు ముందు ఆంధ్రా, తెలంగాణా పోలీసులు కొట్టుకొన్నారు. ఇక ముందు ప్రజలు కూడా రోడ్లమీద కొట్టుకొనే పరిస్థితి దాపురిస్తుంది. కనుక పరిస్థితులు అంతవరకు వెళ్ళకుండా తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu