మీ చరిత్ర చదువుకో.. సుష్మా



పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనలతో.. అట్టుడికి పోతున్నాయి. అలా సభ ప్రారంభమవుతుందో లేదో లలిత్ మోదీ వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ వాదనను కూడా వినకుండా అదేపనిగా పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారు. కాగా సుష్మా తన వాదనను వినిపించేందుకు.. లలిత్ గేట్ వ్యవహారంపై సమాధానం చెప్పేందుకు స్పీకర్  సుమిత్రా మహాజన్ అనుమతి ఇచ్చారు. దీంతో సుష్మా తన వివరణ ఇచ్చారు. తాను మానవత్వంతో లలిత్ మోదీ భార్యకు సహాయం చేశానని.. అది కూడా అందుకు వీలైతేనే.. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోతేనే అనుమతించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. అయితే సుష్మా వివరణ ఇస్తున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం తనను చెప్పనీయకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు రావాలని.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలని గొడవ చేస్తుండగా.. దీంతో స్పీకర్ కాంగ్రెస్ నేతల వైఖరిపై మండిపడి సమాధానం వినాలనుకునే వాళ్లు వినండి లేనివాళ్లు బయటకు వెళ్లి పోవచ్చు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సుష్మా కూడా గందరగోళం మధ్యే వివరణ ఇచ్చారు. 

 

అంతేకాదు పనిలో పనిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి కూడా రెండు చురకలు  అంటించారు. క్విడ్ ప్రోకోకు పాల్పడింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని.. రాహుల్ గాంధీ ఒకసారి సెలవులు తీసుకొని విశ్రాంతి తీసుకున్నారు.. ఈసారి మరోసారి సెలవులు తీసుకొని మీ కుటుంబ చరిత్ర చదువుకో అని మండిపడ్డారు. లలిత్ మోడీకి రైట్ ఆఫ్ రెసిడెన్సీ ఎలా లభించిందని తమను అడగటం కాదని, ఆయనకు రైట్ ఆఫ్ రెసిడెన్సీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu