మోడీ ప్రభుత్వ హామీల లిస్టు



మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న హామీల జాబితాను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చదివి వినిపించారు.  ఆ లిస్టు ఇలా వుంది...

* ప్రతీ పౌరుడికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి.
* జనధన్ యోజనతో11  వేల కోట్లు  జమయ్యాయి.
* ఉపాధికల్పన, ఉత్పత్తి పెంపు మా  ప్రభుత్వ లక్ష్యం.
* పారిశుద్ధ్యం నుండి స్మార్ట్ సిటీల వరకు ప్రాధాన్యం 
* సబ్ కా  సాథ్ , సబ్ కా వికాస్  మా లక్ష్యం
* 2022 నాటికి అందరికీ  గృహ వసతి
* ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు
* సమీకృత అభివృద్దికి కృషి.. ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యత
* దేశవ్యాప్తంగా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం..
* ఆడపిల్లల విద్య రక్షణ కోసం బేటీ బచావో.. బేటీ పఢావో పథకం ద్వారాకృషి.
* టెక్నాలజీని వాడుకొని బ్లాక్ మనీ నిరోధానికి కృషి.
* భూసేకరణలో పారదర్శకతను పాటిస్తాం. రైతులకు పెద్ద పీట వేస్తాం. * మాగ్జిమమ్ గవర్నన్స్, మినిమిం  గవర్నమెంట్..
* సకాలంలో ఉపకార వేతనాలు అందేలా చూస్తాం.
* గిరిజన అభివృద్ధి వనబందు  కళ్యాణ్ యోజన్  పథకం
* మంచివైద్యంకోసం  మిషన్ ఇంద్రధనుష్
* ఈశాన్యరాష్ట్రాల  విద్యాభివృద్ధికి పాటుపడతాం.
* ప్రధానమంత్రి నీటి పారుదల పథకం మొదలుపెడతాం
* పాలనా పరమైన నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాం.
* మహిళా సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
* న్యాయ సంస్కరణలకు పెద్ద పీట వేస్తాం.
* పన్నుల విధానాన్ని సరళీకరణ చేస్తాం.
* మారుమూల ప్రాంతాల్లోను  మౌలిక వసతులు  కల్పిస్తాం.
* కరెంటు లోటుపైనా  ప్రత్యేక దృష్టి పెడతాం.
* పోర్టుల ద్వారా  రవాణాను పెంచుతాం.
* ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు చర్యలు చేపడతాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu