అగస్టా చర్చతో అట్టుడుకుతున్న పార్లమెంట్..


 

పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే ఉత్తరఖండ్ రాజకీయ సంక్షోభం పై సభ దద్దరిపోతుంది. ఈ ఆందోళనలతో సభ ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీనికి తోడు అగస్ట్ వెస్ట్ ల్యాండ్ చాపర్ కుంభకోణంతో సభలో మాటల యుద్దం జరుగుతోంది. కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యస్వామి సభలో ఈ అంశాన్ని లేవదీశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. అంతేకాదు అంశంపై చర్చ చేపట్టాలని తాము వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మరోపక్క, తమ పాలన హయాంలో నిషేధం విధించిన సంస్థను తిరిగి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఎన్డీయే ఎలా భాగస్వామ్యం చేసిందని కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రారంభమైన పార్లమెంటు సమావేశం అగస్టా చర్చతో అట్టుడుకుతోంది.