చెప్పులు మోయించిన మంత్రిగారు
posted on Aug 13, 2015 4:24PM

అధికారం ఉందికదా అని ఎం చేసినా సరిపోతుంది అని అనుకుంటారు కొంత మంది. అలా అధికారం అహంకారంతో చేసే పనుల వల్ల కొన్ని సార్లు విమర్శల పాలవుతారు. అలా చేసి ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటుంది మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే. ఈ మంత్రి గారు చెప్పులు ఆమె దగ్గర పనిచేసే సిబ్బంది ఒకరు మోయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మంత్రి పంకజ ముండే మహారాష్ట్రలో కరువు సంభవించిన పర్భానీ జిల్లా సొన్ పెత్ ప్రాంతంలో పర్యటించారు. అయితే అక్కడ నడవడానికి వీలులేకపోవడంతో ఆమె తను వేసుకున్న చెప్పులు విడిచి నడిచారు. ఇక్కడి వరకూ బానే ఉంది. అయితే ఆమె వేసుకున్న చెప్పులను తన పక్కన ఉన్న సిబ్బందిలో ఒకరు మోయడంతో ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు.
ఇప్పుడు ఈ విషయంపై ప్రతిపక్షాలు.. అదను దొరికింది కదా అని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రిగారు సమాధానం చెప్పాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి పంకజ్ ముండే వివరణ ఇస్తూ ‘మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని.. చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చింది' అని చెప్పారు. అక్కడ చూడాల్సింది కరువు వల్ల దెబ్బతిన్న రైతల సమస్యలు అని అంతేకాని నా చెప్పుల గురించి కాదని సమాధామిచ్చారు.