రావత్‌కు పద్మవిభూషణ్‌.. కొవాగ్జిన్ త‌యారీదారుల‌కు ప‌ద్మ‌భూష‌ణ్‌..

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేళ ప‌ద్మ పుర‌ష్కారాలు ప్ర‌క‌టించింది కేంద్రం. నలుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. 

ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు దేశ రెండ‌వ అత్య‌త్త‌మ అవార్డు ప‌ద్మ‌విభూష‌ణ్ ల‌భించింది. రావ‌త్‌తో పాటు ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్‌ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. 

కొవిడ్ వైర‌స్‌కు చెక్ పెట్టే కొవాగ్జిన్ టీకాలు తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ, తెలుగువారైన‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌ పురస్కారం వ‌రించింది. 

గులాం నబీ ఆజాద్‌, విక్టర్‌ బెనర్జీ, గుర్మీత్‌ బవా, బుద్ధదేవ్‌ భట్టాచార్య, నటరాజన్‌ చంద్రశేఖరన్‌, మధుర్‌ జాఫ్రీ, దేవేంద్ర జఝరియా, రషీద్‌ ఖాన్‌, రాజీవ్‌ మెహిర్‌షీ,  సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌, సైరస్‌ పూనావాలా, సంజయ్‌  రాజారాం, ప్రతిభా రాయ్‌, స్వామి సచ్చిదానంద, వశిష్ఠ్‌ త్రిపాఠిల‌కు ప‌ద్మ భూష‌ణ్‌ పురస్కారం దక్కింది.

ఇక‌ పద్మ అవార్డుల్లో ఏడుగురు తెలుగు వారు ఉన్నారు. అందులో నలుగురు తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు. 
తెలంగాణ నుంచి...
క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత్ బయోటెక్ (ఉమ్మడిగా) 
దర్శనం మొగిలయ్య - కళలు
రామచంద్రయ్య - కళలు
పద్మజా రెడ్డి - కళలు

ఆంధ్రప్రదేశ్ నుంచి...
గ‌రికపాటి నర్సింహారావు - సాహిత్యం/విద్య
గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య
డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు - మెడిసిన్