బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయినట్లేనా జగన్.. జనసేనాని

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలా గ్రామాలు దెబ్బ‌తిన్నాయి. వ‌ర్షం నీరు మోకాల్లోతు ఉన్నా య‌ని రోడ్డు క‌నిపించాక‌నే వెళ్లి బంధువుల్ని ప‌ల‌క‌రిస్తానంటే ఎలా కుదురుతుంది. కేవ‌లం స‌మాచారం అందుకోవ‌డం, అధికారుల‌కు ఆదేశాలు జారీచేసినంత మాత్రాన స‌హాయ‌క చ‌ర్య‌లు  వాటంత‌ట అవి జ‌రిగిపోవు. వాస్త‌వంగా పున‌రావాస కేంద్రాల్లో ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌ను మ‌రింత వేగిరం చేయాలి. కానీ ప్ర‌భుత్వం తీరు అందుకు భిన్నంగా ఉంద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

నాలుగు ట‌మాటాలు, రెండు ఆలూలు, నూనె ఇచ్చేసినంత మాత్రాన చాలా సేవ చేసిన‌ట్టు అవుతుందా? అది కూడా ప్ర‌భుత్వం చెప్పిన‌ది ఒక‌టి అక్క‌డ అమ‌లు చేస్తున్న‌ది మ‌రో విధంగా ఉంద‌ని విప‌క్షాలు తేల్చాయి. క‌నీసం మాన‌వత్వంతో చేయ‌వ‌ల‌సిన ప‌నులు కూడా చేయ‌లేని దుస్థితిలో ప్రభుత్వం ఉంద‌ని భావించాల్సి వ‌స్తోందని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.  గోదావ‌రి క‌న్నెర్ర చేసింది, గోదావ‌రి తీర ప్రాంతాలన్నీ దెబ్బ‌తిన్నాయి. రైతాంగం తీవ్ర‌ంగా న‌ష్ట‌పోయింది. చాలా గ్రామాల్లో ప్ర‌జ‌లు అన్నీ కోల్పోయి పున‌రావాస కేంద్రాల్లో బికుబికుమంటూ ఉన్నారు. క్ర‌మేపీ ప‌రిస్థి తులు శాంతించాయి. కానీ పున‌రావాస కేంద్రాల్లో ఉన్న‌వారి క‌ష్టాల‌ను ప్రభుత్వం విన్న పాపాన‌పోలేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వంద‌లాది గ్రామాల్లో వ‌ర‌ద నీరు ఇళ్ల‌లో నిలిచిపోయి ప్ర‌జ‌లు తిరిగి వెళ్ల‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వారి ప‌రిస్థితిని ఆకాశ‌మార్గాన ప‌ర్య‌టించి చూడ్డం కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను పంపి మ‌రీ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

ప్రభుత్వ ప‌థ‌కాల అమ‌లు గురించి వాక‌బు చేయ‌డానికి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అంటూ గొప్ప‌కార్య‌క్ర‌మంతో అంద రి ద‌గ్గ‌రికీ వెళ్లిన నాయ‌కులు ఇపుడు వెళ్లి వారికి ఎలాంటి స‌హాయం చేయాలో తెలుసుకుంటే బాగుంటుం ద‌ని, కేవ‌లం మాట‌లు, ప్ర‌చారాలు కాకుండా ఇలాంటి స‌మ‌యంలోనే అస‌లు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టా ల‌న్న విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి.

వరదనీరు ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప‌వ‌న్  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వర దల కారణాల వేలాది మంది  బాధితులు  ఇబ్బదులకు గురవుతుంటే.. ఏపీ ప్రభుత్వం పునరావాస కేంద్రా లు నామ మాత్రంగానే ఏర్పాటు చేసిందని ఆరోపించారు. వరదలపై ప్రభుత్వం చేస్తున్న చర్యలను చూ స్తుంటే ప్రభుత్వం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందన్నారు. బటన్‌ నొక్కితే  బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని విమర్శించారు. 

మానవత్వంతో స్పందించి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. కానీ, వరద బాధితుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదని ప‌వ‌న్ ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని కోరితే రాజకీయం చేస్తున్నామని అంటూ.. పాలనా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోయిం దని, ఆహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. 

ప్ర‌జ‌ల్ని ఈ క‌ష్ట‌కాలంలో ఆదుకోవ‌డంతో పాటు వారి భ‌విత‌కు భ‌రోసా ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి అలాంటి ఆలోచ‌నేమీ ఉన్న‌ట్టు లేదు. ప్ర‌కృతి వైప‌రీత్యం క‌నుక  తామేమీ చేయ‌లేమ‌ని చేతులెత్తేస్తే ఇక  ముంపు గ్రామాల ప్ర‌జ‌లు స‌హాయం కోసం ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ‌తారు. ప‌థ‌కాలు, ఓట్ల గురించి ఇంటింటికీ అత్యుత్సా హంతో తిరిగిన‌వారు  ఇక ఇప్పుడు వ‌ర‌ద భ‌యం త‌గ్గిన ఈ స‌మ‌యంలోనైనా స‌హాయ‌క‌చ‌ర్య‌లు వేగిరం చేప‌ట్టి ముంపుగ్రామాల ప్ర‌జ‌ల‌కు ధైర్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వం పై ఉన్న‌ది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News