ఇంటి వద్దకే నిత్యావసరాలు - బుక్ చేసిన గంటలోపే ఇంటి ముందుకు

టోటల్ ఫ్రెష్ యాప్ ఆవిష్కరణ-నామ మాత్రపు ధరలకే అందుబాటులో. కరోనా మహమ్మారిపై మంగళగిరి మున్సిపల్ అధికారులు  సరికొత్త యుద్ధం మొదలు పెట్టారు.వినూత్న ఆలోచన తో టోటల్ ఫ్రెష్ ఆన్ లైన్ యాప్ ద్వారా నిత్యావసర సరుఖుల్ని ప్రజల చెంతకు చేరవేయనున్నారు. కరోనా ప్రబలకుండా చర్యల్లో భాగంగా తద్వారా ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం లక్ష్యం గా పెట్టుకున్నారు.

 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ ప్రజలు వివిధ అవసరాల పేరిట రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ప్రజలను కట్టడి చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రజల అవసరాలను తీర్చేందుకు మున్సిపల్ కమీషనర్ హేమమాలిని  నిత్యావసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు తదితరాలను నేరుగా ప్రజల ఇళ్లకు చేర్చేందుకు టోటల్ ఫ్రెష్ అనే ఆన్ లైన్ యాప్ ద్వారా వసతిని రూపొందింపజేశారు.ఈ యాప్ ను ఆమె బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. యాప్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమీషనర్ నిర్వాహకులకు  సూచించారు ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్స్ లోని ప్లే స్టోర్ లలో డౌన్ లోడ్ చేసుకొని నిత్యావసర సరుఖుల, కూరగాయలు,పండ్లు,పాలు,పెరుగు ప్యాకెట్లు ఆర్డర్ చేస్తే గంట వ్యవధిలో డెలివరీ భాయ్ ఆయా సరుఖుల్ని ఇంటికి తీసుకు వస్తాడు.ఆయా సరుఖులు,కూరగాయలు నామ మాత్రపు ధరలకే లభ్యమవుతాయి.సాధారణంగా సరుఖుల ఇంటికి చేర్చినందుకు 30 రూపాయలు డెలివరీ చార్జీల క్రింద వసూలు చేస్తారు.ప్రస్తుతం ప్రజల ఇబ్బందుల దృశ్యా రూ.15 మాత్రమే డెలివరీ చార్జీలు గా నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.అత్యవసర పరిస్థితుల్లో మెడిసిన్,మాస్కులు,శానిటైజర్లు ఆర్డర్ చేయవచ్చు.ఈ యాప్ ను బన్నీ అండ్ టీమ్  వారం రోజుల్లో తయారు చేశారు.ఇక పై బయటకు వెళ్లి ఆయా దుకాణాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఈ క్రింది లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు https://play.google.com/store/apps/details?id=com.totalfresh.basket

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu