మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డి.. ఫెవికాల్ బంధం
posted on Apr 9, 2025 3:02PM

మెట్రో రైలు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని తెలంగాణ సర్కార్ తిరిగి అదే నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ బుధవారం (ఏప్రిల్ 9) ఉత్తర్వలు జారీ చేశారు. మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రీ అపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో కొనసాగుతున్న వారిని తెలంగాణ సర్కార్ ఇటీవలే తొలగించిన సంగతి తెలిసిందే. అలా తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే మెట్రో సెకండ్ ఫేజ్ సత్వరమే, సజావుగా సాగాలంటే ఎన్వీఎస్ రెడ్డి సేవలు కీలకం, అత్యవసరం అని భావించి ఆయనను తిరిగి నియమించింది.