TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారీగా క్షీణించిన జెన్సన్ హవాంగ్ సంపద: భార్య కానీ విడాకుల కేసు వేస్తే.?

Published on: Tue Nov 10, 2026 2:32PM

కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఎన్విడియా   సంస్థ   సీఈవో జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలు, వివాదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆయన సంపద ఒక్కసారిగా క్షీణించడంతో పాటు, ప్రపంచ కుబేరుల జాబితాలోనూ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 

అమెరికా మార్కెట్లలో సోమవారం (నవంబర్ 9) ట్రేడింగ్ ప్రారంభమైన   ముప్పై నిమిషాల వ్యవధిలోనే జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత నికర ఆస్తి విలువ భారీగా కరిగిపోయింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం,  ఆయన సంపద ఏకంగా 7.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 70 వేల కోట్లు) క్షిణించి 154.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు గణనీయంగా నష్టపోవడం, మార్కెట్ విలువ పడిపోవడం ఆయన సంపదపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతవరకు ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్న జెన్సన్ హువాంగ్, ఏకంగా పదవ స్థానానికి పడిపోయారు. బర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ తదితరులు ఆయనను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లారు. ఎన్విడియా సంస్థలో జెన్సన్ హువాంగ్‌కు సుమారు 3.5 శాతానికి పైగా వాటా ఉండటంతో, కంపెనీ షేర్లలో వచ్చే ప్రతి చిన్న మార్పూ ఆయన వ్యక్తిగత సంపదపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కొద్దికాలంగా జెన్సన్ హువాంగ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, అలాగే గూఢచర్య ఆరోపణలు తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలపై కంపెనీ బోర్డు స్వతంత్ర నిపుణుల ద్వారా అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అయితే కంపెనీకి సంబంధించిన గోప్యమైన సమాచారానికీ, జాతీయ భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని బోర్డు స్పష్టం చేసినప్పటికీ, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి మాత్రం తొలగిపోలేదు.

ఇది కూడా చదవండి: ఇదో స్పై లవ్ స్టోరీ: ఎన్విడియో సీఈవోకు, అమెరికా గూఢచారితో లవ్ ఎఫైర్.!

టెక్ రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ ఇలా వ్యక్తిగత వివాదాలు మరియు చట్టపరమైన సవాళ్ల కారణంగా ఆర్థికంగా వెనుకడుగు వేయడం గ్లోబల్ మార్కెట్లను విస్మయానికి గురిచేసింది. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎన్విడియా కంపెనీ వ్యాపార విస్తరణపై, అలాగే పెట్టుబడిదారుల నమ్మకంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే దానిపై మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ నాయకత్వ స్థిరత్వం మరియు భవిష్యత్ వ్యూహాలపై ఈ వివాదాలు ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.

ఇక పోతే తన అక్రమ సంబంధంపై జెన్సన్ హవాంగ్ ఇప్పటికే భార్యకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఇప్పుడు ఆమె కనుక విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటే  జెన్సన్ హవాంగ్ సంపద మరింత క్షీణించడం ఖాయం. ఎందుకంటే.. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం భార్యా భర్తలు విడాకులు తీసుకుంటే..ఆ దంపతులు వారి వివాహం తరువాత సంపాదించిన ఆస్తి ఇద్దరూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత వరకూ జెన్సన్ హవాంగ్ సతీమణి విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం లేదు. 

మీకు నచ్చవచ్చు:   ఆమెతో వివాహేతర సంబంధం నిజమే.. సంచలన విషయం అంగీకరించిన ఎన్విడియా సీఈఓ.!

48 ఏళ్లుగా నీళ్లు తాగని వారెన్ బఫెట్.. ఏం తాగుతారో తెలుసా.?

[Nvidia CEO Jensen Huang Wealth Fiminish,  Forbes list, Net Wworth Drops, Nvidia Stock Price Fall Personal Controversy, Wife, Divorce, TeluguOne]